మెగా కుటుంబంలో ఆనందం నెలకొంది. టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతులకు పుత్ర రత్నం కలిగింది. ఈ శుభవార్త తెలిసిన వెంటనే చిరంజీవి సహా మెగా కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆనందం పంచుకున్నారు.
ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. “మెగా వారసుడు” వచ్చాడంటూ మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.