నేటి డిజిటల్ యుగంలో.. పోటీతో కూడిన వ్యాపార ప్రపంచంలో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు (MSMEలు) నిలదొక్కుకోవడం ఓ సవాల్‌గానే మారింది. పెట్టుబడుల కొరత, తక్కువ వడ్డీకీ రుణాలు అందకపోవడం, మార్కెట్ పోటీ — ఇవన్నీ MSMEలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు.

ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం "ఉద్యం పోర్టల్ (udyamregistration.gov.in)" ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పోర్టల్ ద్వారా MSME యజమానులు ఎటువంటి ఫీజులు లేకుండా, పూర్తిగా ఆన్‌లైన్‌లో తమ వ్యాపారాలను నమోదు చేసుకోవచ్చు. ఉద్యం సర్టిఫికేట్‌తో వ్యాపార యజమానులు తక్కువ వడ్డీ రుణాలు, పన్ను మినహాయింపులు, ప్రభుత్వ పథకాలు, టెండర్లు వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

📌 ఉద్యంలో రిజిస్టర్ కావడం వల్ల లభించే ప్రయోజనాలు:

  • తక్కువ వడ్డీకే బ్యాంకు లోన్లు (SBI, HDFC వంటి బ్యాంకుల ద్వారా)
  • పబ్లిక్ ప్రొక్యుర్‌మెంట్ పాలసీ, క్యాపిటల్ సబ్సిడీలు, MAT క్రెడిట్ పొడిగింపు వంటి పథకాల అర్హత
  • వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ ద్వారా రుణ భారం తగ్గింపు
  • ప్రభుత్వ టెండర్లలో ప్రత్యేక ప్రాధాన్యత

📎 రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు: ఆధార్, పాన్, GST, బ్యాంక్ డిటెయిల్స్, వ్యాపార వివరాలు

👉 అధికారిక పోర్టల్: https://udyamregistration.gov.in

ఇవన్ని ఒక్క ఉచిత రిజిస్ట్రేషన్‌తోనే సాధ్యం కావడం — ఈ ఉద్యం పోర్టల్ ప్రత్యేకత. మీరు కూడా వ్యాపారవేత్త అయితే, ఇప్పుడే రిజిస్టర్ అయి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.