రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా భారీ సుంకాలు విధించింది.
📌 ఇప్పటివరకు ఉన్న 25% సుంకాలకు అదనంగా మరో 25% పెంచడంతో మొత్తం 50% సుంకాలు అమల్లోకి వచ్చాయి.
📌 అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12:01 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9:30 గంటలకు) ఈ కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి.
📌 దీంతో భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతులపై భారీ ఆర్థిక భారం పడనుంది.