మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గోదావరి డ్రింకింగ్ వాటర్‌ స్కీమ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు.

  • రూ.7,360 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్
  • రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పం
  • మూసీ పునరుజ్జీవం పథకంలో భాగంగా ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ చెరువులు మంచినీటితో నిండేలా చర్యలు

ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాలకు తాగునీటి సమస్యకు గణనీయమైన ఉపశమనం కలుగనుంది.