బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనుంది. హైకోర్టు తీర్పు వివరాలను పరిశీలించిన అనంతరం, సీనియర్‌ కౌన్సిల్‌ ద్వారా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బీసీలకు కల్పించిన రిజర్వేషన్లలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత నిలబెట్టేందుకు అన్ని చట్టపరమైన మార్గాల్లో పోరాడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.