సెప్టెంబర్ 22, 2025 నుంచి Swiggy, Zomato, Magicpin వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాంలలో ఆర్డర్ చేయడం మరింత ఖరీదవనుంది.
ప్రభుత్వం తాజాగా డెలివరీ ఛార్జీలపై 18% GST విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల వినియోగదారుల ఖర్చు నేరుగా పెరగనుంది.
అంతేకాకుండా, ఫెస్టివల్ సీజన్‌కు ముందుగానే డెలివరీ కంపెనీలు ప్లాట్‌ఫామ్ ఫీజులు పెంచడం వల్ల ధరలు మరోమారు భారమయ్యే అవకాశం ఉంది.
ఈ మార్పులు అమల్లోకి వచ్చిన వెంటనే వినియోగదారులు ఫుడ్ ఆర్డర్లలో అదనపు ఖర్చును ఎదుర్కోవాల్సి ఉంటుంది.