నేపాల్ తాత్కాలిక పీఎంగా సుశీల!
నేపాల్‌లో నడుస్తోన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో జెన్ జీ ఆందోళనకారులు తాత్కాలిక పీఎంగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీని ప్రతిపాదించారు. నిరసనకారులతో వర్చువల్‌గా సమావేశమైన సుశీల ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆమె నేతృత్వంలో ఆర్మీ చీఫ్‌తో చర్చలకు నిరసనకారులు సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న యువత ఈ చర్చల్లో పాల్గొనొద్దన్న నిబంధనలకు జెన్ జీ అంగీకరించినట్లు తెలుస్తోంది.