డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నకిలీ సర్టిఫికెట్లు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 890 నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
కృష్ణా జిల్లాలో మాత్రమే 421 నకిలీ స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు బయటపడ్డాయి.
నిజమైన క్రీడాకారులు కాకుండా, తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగం పొందాలని ప్రయత్నించినవారు పట్టుబడుతున్నారు.
ఈ కారణంగా వెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోంది.
నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, స్పోర్ట్స్ కోటా ఉద్యోగ అవకాశాలను రద్దు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
Follow the Telugu News Adda channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VbBL0LE96H4Txkoew114