ఉత్తరప్రదేశ్‌లో ఓ అద్భుతమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బులంద్‌శహర్ ప్రాంతానికి చెందిన చిన్నపాటి వ్యాపారి సుధీర్‌కు ఏకంగా రూ.141 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు వచ్చింది.
👉 గుర్తు తెలియని వ్యక్తులు అతని పాన్‌కార్డ్‌ను దుర్వినియోగం చేసి, ఢిల్లీలో ఆరు కంపెనీలు నడుపుతున్నట్లు బయటపడింది.
👉 2022లోనూ ఇలాంటి సమస్యను ఎదుర్కొన్న సుధీర్, సీజీఎస్టీ కార్యాలయం నుంచి నోటీసు పొందారని తెలిపారు.
👉 ఆ కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పన్ను అధికారులకు ఇప్పటికే వివరణ ఇచ్చానని చెప్పారు.
👉 అయితే జూలై 10న, తాను ₹141,38,47,126 ఎగవేశానని మరోసారి నోటీసు రావడంతో అతను షాక్‌కి గురయ్యాడు.