🟨 నిధి పోర్టల్ లో Transfer In మరియు Transfer Out మార్గదర్శకాలు

🔁 Transfer Out:

మీరు బదిలీ అయిన తేదీ (రిలీవ్ అయిన రోజు) నిధి పోర్టల్‌లో Old DDO లాగిన్ ద్వారా "Transfer Out" చేయాలి.


🔁 Transfer In:

**జాయిన్ అయ్యే తేదీ**ను "Date of Joining"గా పేర్కొంటూ కొత్త DDO లాగిన్ ద్వారా "Transfer In" చేయాలి.


⚠️ ముఖ్యమైన నిబంధన:

ఒకే రోజున Transfer Out మరియు Transfer In చేయడానికి అనుమతి లేదు.

ఉదయం రిలీవ్ అయ్యి అదే రోజున కొత్త స్థలంలో జాయిన్ అయినా కూడా, Transfer Out = రిలీవ్ అయిన ముందు రోజు డేట్, Transfer In = జాయిన్ అయిన తేదీ రోజుగా నమోదు చేయాలి.

ఒక రోజు ఉదయం రిలీవ్ అయితే ఇంక ఆరోజు ఆ స్టేషన్ లో పనిచేయనట్టు వస్తుంది, అందుకే జాయినింగ్ స్టేషన్ లో కూడా అదే రోజు ఉదయం మాత్రమే జాయిన్ చేసుకుంటారు.

సాయంత్రం రిలీవ్ అయితే అదే రోజు సాయంత్రం లేదా తర్వాత రోజు ఉదయం కొత్త స్టేషన్ లో జాయిన్ అవ్వచ్చు.


📄 Non Drawal Certificate:

రిలీవ్ అయిన తేదీ వరకు పాత DDO వద్ద నుండి Non Drawal Certificate తీసుకోవాలి.