ఏపీ పంచాయతీరాజ్ శాఖలో 211 మందికి పదోన్నతులు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో భారీగా ప్రమోషన్లు మంజూరయ్యాయి. ఒకేసారి 211 మంది అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు వేర్వేరు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పదోన్నతుల వివరాలు
53 మంది ఎంపీడీవోలు → డీఎల్‌డీవోలు
158 మంది అధికారులు → డిప్యూటీ ఎంపీడీవోలు, జిల్లా పరిషత్, డివిజనల్ పంచాయతీ కార్యాలయాల్లో పరిపాలనా అధికారులు
ఎన్నికల అనంతరం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఈ వివరాలు వెల్లడించారు