హైదరాబాద్:
సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో పెద్ద భరోసా కల్పించేందుకు భారతీయ పోస్టల్ డిపార్ట్‌మెంట్ (India Post) మరో ముఖ్యమైన భీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. India Post Payments Bank (IPPB) ద్వారా ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్తో కలిసి ఈ పథకం అందిస్తున్నారు.
ENABLE NOTIFICATIONS FOR MORE UPDATES
🔹 తక్కువ ప్రీమియం – పెద్ద రక్షణ
- రోజుకి కేవలం రూ.1.50 చెల్లిస్తే రూ.10 లక్షల రక్షణ
- రోజుకి రూ.2 చెల్లిస్తే రూ.15 లక్షల రక్షణ
- ఏడాదికి రూ.549తో రూ.10 లక్షలు, రూ.749తో రూ.15 లక్షల బీమా పొందవచ్చు.
🔹 అర్హతలు
- వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి.
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలందరికీ ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది.
- ఏ పోస్టాఫీసులోనైనా లేదా IPPB ద్వారా సులభంగా పాలసీ పొందవచ్చు.
🔹 ప్రధాన ప్రయోజనాలు
- ప్రమాదాల సమయంలో తక్షణ రక్షణ
- హాస్పిటల్ ఖర్చులకు సహాయం
- కుటుంబానికి ఆర్థిక భరోసా
- తక్కువ మొత్తంతో ఎక్కువ సెక్యూరిటీ
👉 మొత్తానికి…
రోజువారీ జీవితంలో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, కుటుంబానికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ భీమా రక్షణ ద్వారా పెద్ద భరోసా కల్పించవచ్చు. గ్రామీణ ప్రజలకు, కూలీలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరం.