గ్రామ–వార్డు సచివాలయ వ్యవస్థ ఉద్యోగులకు ఎటువంటి శాశ్వత ప్రయోజనాలు కల్పించకపోగా, వారిని కూలీల మాదిరిగా వాడుకోవడమే తప్ప, వారి భవిష్యత్తు గురించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం సచివాలయాల నిర్వహణ ఖర్చులు పెరిగిపోతూ, ఉద్యోగులకు మాత్రం కనీస గౌరవం లభించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
సుమారు లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు సమాజంలో "సచివాలయ ఉద్యోగి" అన్న పేరుతో వివక్షకు గురవుతుండటం తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోందని తెలిపారు. అదనంగా, పండుగలు, సెలవులు కూడా లేకుండా ఉద్యోగులను వత్తిడి చేసి, వారి కుటుంబ జీవితాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు.
ఉద్యోగులను మాతృశాఖలలో లేదా ఇతర ప్రభుత్వ శాఖలలో విలీనం చేయాలని, లేకపోతే ఖాళీ ఉన్న పోస్టుల్లో సర్దుబాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యోగులు మానసిక ఒత్తిడితో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురవుతారని హెచ్చరించారు.
ఉద్యోగుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్ గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర చైర్మన్ షేక్ జాని పాషా, రాష్ట్ర కార్యదర్శి జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, రాష్ట్ర కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు