ఆగస్టు 1, 2025 నుంచి UPI లో కొన్ని ముఖ్యమైన మార్పులు అమలులోకి వస్తున్నాయి. ఈ మార్పులు UPI సర్వర్‌పై భారం తగ్గించడం, లావాదేవీల వేగం పెంచడం, సేవల్లో అంతరాయం లేకుండా చేయడం లక్ష్యంగా తీసుకున్నారు.

ప్రతి రోజూ గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. ఇది ఒకే యాప్ అయినా, వేరే యాప్‌లు అయినా కలిపి ఉంటుంది. మొబైల్ నంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాల సమాచారం రోజుకు 25 సార్లే చూడొచ్చు. పెండింగ్ లో ఉన్న లావాదేవీ స్టేటస్ రోజుకు 3 సార్లు మాత్రమే చెక్ చేయాలి. చెక్ చేయడాన్ని మధ్య కనీసం 90 సెకన్ల గ్యాప్ ఉండాలి.

ఆటోపే (Netflix, EMI, SIPలు వంటివి) లావాదేవీలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9:30 గంటల వరకు ప్రాసెస్ కావు. కొత్త బ్యాంక్ ఖాతాను UPI యాప్‌కి లింక్ చేయాలంటే మరింత కఠినమైన ధృవీకరణ ఉంటుంది.

ఇవి తరచుగా బ్యాలెన్స్ చెక్ చేసే వారు, ఆటోపేలు ఎక్కువగా ఉన్నవారికి ముఖ్యమైన మార్పులు. సాధారణ వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ మార్పులు వల్ల UPI సేవలు మరింత వేగంగా, నమ్మకంగా అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.