అమరావతి: దివ్యాంగులందరికీ సెప్టెంబరు నెల పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత 8 నెలలుగా చేసిన తనిఖీలో 1.35 లక్షల మంది అనర్హులుగా గుర్తించి నోటీసులు జారీ చేశారు. వీరిలో అర్హులంటే అర్హులు, అనర్హులంటే అనర్హులు చేసేందుకు సూచించారు.

అలా చేసుకున్న వారికి సెప్టెంబరు నెల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 95 శాతం మంది అర్హులు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అనర్హుల నిర్ధారణలో నోటీసులతో సంబంధం లేకుండా అర్హులుగా ఉన్నవారికి పెన్షన్ అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నోటీసుల కారణంగా నిజమైన అర్హులు భారిగానే ఉన్నందున వారి విషయంపై ఏమి చేయాలనే దానిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు చెప్పారు.

మొత్తం 7.50 లక్షల దివ్యాంగుల పెన్షన్లలో ఇంకా 2 లక్షల మందిపై తనిఖీ చేయాల్సి ఉంది. తదుపరి తనిఖీ పూర్తయిన తర్వాత వారి పై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.