అమరావతి: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కిన “ఓజీ” సినిమాకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఈ నెల 25న అర్థరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

 బెనిఫిట్ షో టికెట్ రేటు రూ.1,000గా నిర్ణయించగా, సాధారణ ప్రదర్శనల్లో కూడా రేట్లు పెంపునకు అవకాశం కల్పించారు.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.125 అదనంగా,మల్టీప్లెక్స్‌లలో రూ.150 అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.


ఈ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. “ఓజీ” విడుదల రోజున రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల వద్ద అభిమానుల హడావిడి నెలకొనే అవకాశం ఉంది.