ఆస్తి కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే ఇక మేమే యజమానులు అనుకుంటే అది పెద్ద పొరపాటు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. కేవలం రిజిస్ట్రేషన్‌ అనేది యజమాన్యం రుజువు కాదు ముఖ్యంగా Mutation తప్పనిసరి అని స్పష్టం చేసింది.

⚠️ రిజిస్ట్రేషన్‌ అంటే ఏమిటి?

రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఒక లీగల్ ప్రొసీజర్ మాత్రమే. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాలు సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఎవరు నిజమైన యజమాని, పాత టైటిల్ డీడ్స్ సరైనవా లేదా అన్నది చెక్ చేయరు.

😨 అసలు ప్రమాదం ఎక్కడుంది?

మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీకి ముందే ఎవరో కేసు వేసి ఉంటే…

పాత యజమానులు పూర్తి పత్రాలు ఇవ్వకపోతే…

బ్యాంకు బకాయిలు, లోన్లు క్లియర్ చేయకపోతే…

లేఅవుట్ అప్రూవల్ లేదా RERA అనుమతి లేకపోతే…


👉 రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా మీ యజమాన్యం ఎప్పుడైనా సవాల్‌కు గురవుతుంది.

👨‍⚖️ సుప్రీంకోర్టు స్పష్టీకరణ

“సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్‌ చేసే పని మాత్రమే చేస్తారు. కానీ అసలు యజమాన్యం ఎవరిది అనేది వారు నిర్ణయించలేరు. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది యజమాన్యం కాదు” అని కోర్టు స్పష్టం చేసింది.

📝 కొనుగోలు దారులు తప్పనిసరిగా చెక్ చేయాల్సినవి:

టైటిల్ చైన్ (పాత సేల్ డీడ్స్)

ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ (EC)

మ్యూటేషన్ రికార్డులు (Adangal / 1B)

ఎలాంటి కోర్టు కేసులు ఉన్నాయో లేవో

మునిసిపల్ / పంచాయతి అనుమతులు, లేఅవుట్ క్లియరెన్స్, RERA రిజిస్ట్రేషన్