ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా డీఎస్సీ – 2025 తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది.
👉 16,347 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్, మునిసిపల్, గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ, మోడల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, దివ్యాంగుల పాఠశాలలు, జువెనైల్ వెల్ఫేర్ శాఖల పరిధిలో నియామక ప్రక్రియ జరిగింది.
📌 ముఖ్యాంశాలు:
20-04-2025న నోటిఫికేషన్ విడుదల
3,36,300 అభ్యర్థుల నుండి 5,77,675 దరఖాస్తులు
06-06-2025 నుండి 02-07-2025 వరకు CBT పరీక్షలు
05-07-2025న ప్రాథమిక కీ, 01-08-2025న తుదికీ విడుదల
అభ్యర్థుల టెట్ స్కోరు (20%) + డీఎస్సీ స్కోరు (80%)కి వెయిటేజ్
28-08-2025 నుండి 13-09-2025 వరకు 7 రౌండ్లలో ధృవపత్రాల పరిశీలన
✅ తుది ఎంపిక జాబితా సెప్టెంబర్ 15, 2025న విడుదల
జిల్లా వారీగా, మేనేజ్మెంట్ వారీగా, పోస్టు వారీగా జాబితాలు తయారు
అభ్యర్థుల తుది ఎంపిక జాబితా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది.