మలినేని ఇంజినీరింగ్ కళాశాల (ఆటోనమస్) విద్యార్థినిల ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి రుజువైంది.
మలేషియాలోని యూనివర్సిటీ కాంగ్సాన్ మలేషియా (UKM) లో నిర్వహించిన IEEE YESIST12-2025 (Innovation Challenge Track – Direct Entry) పోటీలో మలినేని విద్యార్థినిల బృందం విశేష ప్రతిభ కనబర్చింది. "మల్టీ మోడల్ ట్రాన్స్‌లేషన్ ప్లాట్‌ఫాం" అనే వినూత్న ప్రాజెక్ట్‌తో పాల్గొన్న వీరు, అంతర్జాతీయ స్థాయిలో రెండవ ర్యాంక్ సాధించి కాలేజీకి గౌరవాన్ని తీసుకువచ్చారు.
ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే, అనేక భాషల్లో Speech-to-Text, Text-to-Speech, Text-to-Text అనువాదాన్ని సులభంగా చేయగల ప్లాట్‌ఫాం రూపకల్పన. గ్లోబల్ లెవల్‌లో పోటీ పడిన అనేక బృందాల్లో మలినేని విద్యార్థినిల ప్రాజెక్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విద్యార్థినిల ఈ విజయంపై కాలేజీ చైర్మన్, కార్యదర్శి, ప్రిన్సిపాల్, విభాగాధిపతులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని గ్లోబల్ అచీవ్‌మెంట్స్ సాధించాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు.