మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ శాఖలో ఒక్క అవినీతి ఘటన వెలుగు చూసింది. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బీరం త్రినాథ్‌ అనే అధికారి, ల్యాండ్ కన్వర్షన్ పనికి సంబంధించి రూ.40,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ప్రత్యక్ష సాక్ష్యాలతో ACB అధికారులు త్రినాథ్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలా లంచం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం పట్ల స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులతో పాటు సంబంధిత శాఖపై ప్రశ్నలు మొదలయ్యాయి.