కేరళ హైకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు వ్యభిచార కేంద్రాలు నడిపే వారిపై మాత్రమే కేసులు నమోదవుతుండగా, ఇకపై అక్కడకు వెళ్లే కస్టమర్లపై కూడా ఇమోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. న్యాయవర్గాలు, సామాజిక సంస్థలు దీన్ని స్వాగతించాయి. ఈ తీర్పు వలన వేశ్యావృత్తి డిమాండ్ తగ్గి, మహిళలపై జరిగే దోపిడీ నియంత్రణలోకి వస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.