మేల్కోండి సచివాలయ ఉద్యోగ మిత్రులారా
ఇకనైనా ఒకే తాటిపైకి రావాల్సిన సమయం వచ్చింది. మనం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే కాకుండా, వివిధ శాఖల్లో పనిచేస్తున్న 21 విభాగాల ఉద్యోగులు కూడా కలిసినప్పుడు మాత్రమే మన సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వం ముందు మన అభ్యర్థనలు బలంగా వినిపించాలంటే మనం ఏకమై, ఒక వేదికపై నిలబడాలి.
ప్రతి జిల్లాలో చురుకైన టీంలు ఏర్పడితేనే ఆ సమస్యలను సక్రమంగా గుర్తించి, సమన్వయం చేసి, పరిష్కారం దిశగా తీసుకెళ్లవచ్చు. అందుకే 26 జిల్లాల కోసం 21 మంది ప్రతినిధులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మీరందరూ సిద్ధంగా ఉన్నారా?
మీరు సిద్ధమని భావిస్తే, దయచేసి క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మీ వివరాలను నమోదు చేసుకోండి. మీ పేరు, జిల్లా, శాఖ వివరాలు ఇచ్చి నమోదు అయితే, త్వరలోనే మీరు కూడా ఈ ఐక్య ఉద్యమంలో భాగస్వాములు అవుతారు.
మన బలం మన ఐక్యతలోనే ఉంది. అందువల్ల అందరూ ఒకే జెండా కింద చేరి మన హక్కుల కోసం, మన భవిష్యత్తు కోసం కలిసి నడుద్దాం.
ధన్యవాదములు అందరికీ
JAC State Team
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ