విజయవాడలోని BRTS రోడ్డుపై ఆదివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫుడ్ జంక్షన్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుకోని సంఘటనలు చోటుచేసుకున్నాయి.
👉 యూట్యూబర్లతో కలిసి రీల్స్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు యువకులను ఆపి మందలించే క్రమంలో బూతులు తిట్టిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో అక్కడున్న యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఎదురు తిరిగి నినాదాలు చేశారు.
👉 యువకులకు వాహన చోదకులు కూడా మద్దతు ఇవ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అదనపు సిబ్బందిని ఘటనాస్థలానికి తరలించారు.
👉 తర్వాత CI కిషోర్ యువకులకు క్షమాపణలు చెప్పినా, మద్యం సేవించి ఉన్నామని అవమానకరంగా బూతులు తిట్టిన అధికారిపై చర్యలు తీసుకోవాలని యువకులు డిమాండ్ చేశారు.
👉 “పెండింగ్ చలాన్లు ఉన్నాయంటూ ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెప్పించమన్నా వినకుండా అందరిలో పరువు తీశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మా మీదే దోషం మోపుతారనే భయం ఉంది” అని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.