యాపిల్ తన తాజా ఐఫోన్-17 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు సమకూర్చారు. డిస్‌ప్లే, కెమెరా, పనితీరు రంగాల్లో విప్లవాత్మక అప్‌డేట్స్‌తో ఐఫోన్-17 ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
256 జీబీ వేరియంట్ ధరను ₹82,900గా నిర్ణయించారు. ఇతర స్టోరేజ్ మోడళ్ల ధరలు కూడా త్వరలో వెల్లడించే అవకాశముంది. ఇక ఈ కొత్త ఐఫోన్-17 సిరీస్ ఫోన్లు ఈనెల 19వ తేదీ నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయి.
👉 కొత్త సిరీస్‌తో యాపిల్ మరల స్మార్ట్‌ఫోన్ రంగంలో పోటీతత్వాన్ని పెంచబోతోందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.