భారత్‌–అమెరికా మధ్య పోస్టల్‌ సేవలపై కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు భారత్‌పై 50% పన్నులు విధించిన నేపథ్యంలో భారత్‌ కఠిన నిర్ణయం తీసుకుంది. తపాలా శాఖ శనివారం ప్రకటన చేస్తూ, ఆగస్టు 25 నుంచి అమెరికాకు పోస్టల్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

📌 అమెరికాకు పంపే పోస్టల్‌ కన్సైన్‌మెంట్‌లు ఇకపై స్వీకరించబడవు.
📌 వంద డాలర్ల లోపు విలువైన లేఖలు, పత్రాలు, గిఫ్ట్‌ ఐటమ్స్‌ మాత్రం అనుమతిస్తారు.
📌 ఇప్పటికే బుక్‌ చేసిన పార్శిల్‌లు డెలివరీ కాకపోతే, కస్టమర్లు రిఫండ్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చని పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ స్పష్టం చేసింది.

విమానయాన సంస్థలు కూడా ఆగస్టు 25 తర్వాత అమెరికాకు పార్శిల్‌ రవాణా చేయబోమని ప్రకటించాయి. ఈ పరిణామాలపై తపాలా శాఖ స్పందిస్తూ –
👉 “కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. వీలైనంత త్వరగా అమెరికాకు పూర్తి సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపింది.