పెరిగిన ఖర్చులతో భారతీయ కుటుంబాలు ఇబ్బందుల్లో

  • వరల్డ్‌ప్యానెల్‌ బై న్యూమరేటర్‌ రిపోర్ట్‌ ప్రకారం దేశంలోని 58% కుటుంబాలు ఖర్చులను నిర్వహించడంలో ఇబ్బంది పడుతున్నాయి.
  • 6,000పైగా కుటుంబాలపై చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఖర్చుల పెరుగుదల

  • 2025 మార్చితో ముగిసిన త్రైమాసికంలో సగటు కుటుంబ వ్యయం రూ.56,135.
  • 2022లో ఇది రూ.42,000 మాత్రమే.
  • గ్రామీణ తక్కువ ఆదాయ వర్గాల్లో 18% పెరుగుదల.
  • పట్టణ ఉన్నత ఆదాయ వర్గాల్లో 15% పెరుగుదల.

వినియోగదారుల పరిస్థితి

  • కుటుంబాలు అవసరమైన వస్తువులు, రుణ చెల్లింపులు, పొదుపుల మధ్య సమతుల్యం చేయలేక ఇబ్బందులు.
  • కేవలం 17% కుటుంబాలు మాత్రమే సౌకర్యవంతంగా జీవిస్తున్నాయి.
  • 80% కుటుంబాలు అవసరమైన కిరాణా వస్తువులపైనే ఖర్చు పెడుతున్నారు.
  • చాలామంది చౌక బ్రాండ్‌లను ఎంచుకోవడం, ఆకస్మిక కొనుగోళ్లు తగ్గించడం.