కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు

  • ఎన్నికల హామీలు – రైల్వే, రోడ్డు మార్గాల అభివృద్ధిలో ఈ ఏడాది పురోగతి సాధించామని తెలిపారు.
  • జాతీయ రహదారి విస్తరణ – రూ.3,200 కోట్ల మంజూరుకు అనుమతి త్వరలో వస్తుందని వెల్లడించారు.
  • రైల్వే సౌకర్యాలు
    • గతంలో అత్తిలిలో ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఆగేది కాదు, ఇప్పుడు 3 ట్రైన్లు ఆగుతున్నాయి.
    • నరసాపురం కి వందే భారత్ రైలు తీసుకురావడంలో విజయవంతమయ్యామని, ఈ వారం లోనే రైలు రానుందని చెప్పారు.
    • గుడివాడ, భీమవరం, నరసాపురం లో హాల్ట్ ఉంటుంది.
    • ఇది ఆక్వా రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.
    • అరుణాచలం ట్రైన్‌ను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు.
    • సికింద్రాబాద్–మైసూరు వందే భారత్ రైలు కూడా నరసాపురం తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
    • నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.
    • త్వరలో తాడేపల్లిగూడెం లో కూడా హాల్ట్ ఏర్పడుతుంది.
  • రోడ్డు అభివృద్ధి
    • పెండింగ్‌లో ఉన్న బైపాస్ రోడ్ పనులు ప్రారంభమయ్యాయి.
    • 4 చోట్ల ROB (రైల్వే ఓవర్ బ్రిడ్జ్) నిర్మాణానికి అనుమతులు వచ్చాయని, త్వరలో టెండర్లు పిలుస్తారని చెప్పారు.
  • వ్యక్తిగత వ్యాఖ్యలు
    • అవినీతికి ఆస్కారం లేకుండా పని చేస్తున్నానని స్పష్టం చేశారు.
    • అందరి ఎమ్మెల్యేలతో సోదరభావంతో పనిచేస్తున్నానని చెప్పారు.
    • “నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి చూస్తే, నాలోని అపరిచితుడు బయటకు వస్తాడు.. జాగ్రత్త” అంటూ హెచ్చరిక జారీ చేశారు.