NSDL ద్వారా e-PAN డౌన్‌లోడ్ చేయడం ఎలా?

  1. 👉 https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  2. హోమ్‌పేజ్‌లో "Instant e-PAN" అనే లింక్‌పై క్లిక్ చేయండి.
  3. ఇప్పుడు “Check Status / Download PAN” పై క్లిక్ చేయాలి.
  4. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
  5. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్‌కి వచ్చిన OTP నమోదు చేయండి.
  6. డిటైల్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత, మీకు PDF ఫార్మాట్‌లో e-PAN డౌన్‌లోడ్ అవుతుంది.

📌 గమనిక: మీ ఆధార్ ఆధారంగా పాన్ తీసుకున్నవారికే ఇది పనిచేస్తుంది.


 UTIITSL ద్వారా e-PAN డౌన్‌లోడ్ చేయడం ఎలా?

  1. 👉 https://www.pan.utiitsl.com/PAN_ONLINE వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  2. "Download e-PAN Card (For PAN Allotted)" అనే లింక్‌పై క్లిక్ చేయండి.
  3. పాన్ నంబర్, జనన తేది (DD-MM-YYYY), క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
  4. తర్వాత మీ మొబైల్‌కి వచ్చిన OTPను ఎంటర్ చేయండి.
  5. కాస్త ఇంపుత్ ఇచ్చిన తర్వాత, మీ e-PAN PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

📌 గమనిక: UTIITSL ద్వారా చేసిన వాళ్లకే ఇది వర్తిస్తుంది. కొన్నిసార్లు ₹8.26 ఫీజు వసూలు చేస్తారు.


 ముఖ్యమైన విషయాలు:

  • e-PAN అనేది డిజిటల్ సంతకం చేసిన పాన్ కార్డ్ PDF రూపంలో ఉంటుంది.
  • ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా పని చేయాలి.
  • డౌన్‌లోడ్ చేసిన e-PANను అన్ని కార్యాలయాల్లో చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్‌లా వాడొచ్చు.