పరమ పవిత్రమైన వశిష్ట గోదావరి మాతకు, ప్రతి అమావాస్యకు నరసాపురం వలందర్ రేవులో  విహెచ్పి మరియు బజరంగ్దళ్ ఆధ్వర్యంలో  గోదావరి హారతిని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా నిన్న రాత్రి ఆషాడ శుద్ధ అమావాస్యను పురస్కరించుకుని, గోదావరి మాతకు హారతి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శృంగ వృక్షం దత్త పీఠాధిపతి శ్రీ నాగానంద సరస్వతి స్వామి వారు, భద్రాద్రి కొత్తగూడెం అన్నపూర్ణ పీఠాధిపతి శ్రీ అరుణానాథ స్వామీజీ వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇకనుండి కాశీలో ఏ విధంగా అయితే గంగా హారతి జరుగుతుందో అదే విధంగా మన గోదావరి జిల్లాలో నరసాపురం కేంద్రంగా ప్రతి అమావాస్యకు కూడా గంగా హారతి నిర్వహిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని చిత్రాల కోసం గ్యాలరీ చూడగలరు