హర్ ఘర్ తిరంగా 2025

🔶 కార్యక్రమం మొత్తం మూడు దశలుగా ఉంది:

📌 ఫేజ్ 1: 2 ఆగస్ట్ – 8 ఆగస్ట్ 2025

లక్ష్యం: దేశభక్తి భావాన్ని రేకెత్తించడం, త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం.

  • స్కూల్‌ల గోడలపై త్రివర్ణ కళా చిత్రాలు వేయించాలి
  • సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయాలి – #HarGharTiranga2025
  • త్రివర్ణ ప్రదర్శనలు – రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలి
  • రంగోలీ పోటీలు – పబ్లిక్ ప్లేస్‌లలో నిర్వహించాలి
  • త్రివర్ణ క్విజ్ – MyGov వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది
  • తిరంగా రాఖీ తయారీ వర్క్షాప్‌లు – పాఠశాలలు, ఆంగన్‌వాడీలు, వృద్ధాశ్రమాలు మొదలైన వాటిలో నిర్వహించాలి
  • జవాన్లు, పోలీసులకు లేఖలు రాయడం – విద్యార్థుల చేత రాయించాలి
  • స్వచ్ఛతా ఉద్యమం – గ్రామాల్లో జల శక్తి, సంస్కృతి మంత్రిత్వ శాఖలతో కలిపి ప్రత్యేక కార్యక్రమాలు
  • తిరంగా వాలంటీర్ రిజిస్ట్రేషన్ – ఫ్లాగ్ సెల్ఫీ తీసి షేర్ చేయాలి

📌 ఫేజ్ 2: 9 ఆగస్ట్ – 12 ఆగస్ట్ 2025

లక్ష్యం: ఉత్సాహంతో దేశమంతటా ప్రజల భాగస్వామ్యం.

  • తిరంగా మహోత్సవ్ – సీఎం, గవర్నర్ హాజరైన VIP ఈవెంట్లు
  • తిరంగా మేళా & కచేరీ – స్థానిక వస్తువుల అమ్మకాలు, దేశభక్తి పాటలు
  • తిరంగా బైక్ ర్యాలీ/సైకిల్ ర్యాలీ – NSS, పోలీసులతో కలసి నిర్వహించాలి
  • తిరంగా యాత్రలు – పెద్ద ఎత్తున జెండాలతో ఊరేగింపులు
  • హ్యుమన్ చైన్స్ – ప్రజలతో జెండా చైన్‌లు
  • తిరంగా అమ్మకాలు & పంపిణీ – స్థానిక తయారీకి ప్రాధాన్యం
  • మీడియా ప్రచారం – రేడియో, సోషల్ మీడియా, ప్రముఖుల ద్వారా ప్రచారం

📌 ఫేజ్ 3: 13 ఆగస్ట్ – 15 ఆగస్ట్ 2025

లక్ష్యం: జాతీయ పతాకం ఇంటింటా ఉంచడం, సెల్ఫీలు అప్‌లోడ్ చేయడం.

  • ప్రతి ఇంటిలో, ఆఫీస్‌లో, వాహనాల్లో జెండాను పాడుకోవాలి
  • Flag Hoisting కార్యక్రమాలు అన్ని గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించాలి
  • Selfie with Tiranga వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి

🔔 ప్రత్యేక సూచనలు:

  • 2 ఆగస్టు నుంచే త్రివర్ణ లైటింగ్ & అలంకరణలు ప్రారంభించాలి
  • పబ్లిక్ ప్లేస్‌లలో త్రివర్ణ రంగోలీలు, దీపాలు, డెకరేషన్‌లు ఏర్పాటు చేయాలి

హర్ ఘర్ తిరంగా కార్యక్రమం – ముఖ్యాంశాలు:

  • కార్యక్రమం ఉద్దేశ్యం: ప్రతి ఇంటిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా దేశభక్తిని ప్రదర్శించడమే ముఖ్య ఉద్దేశ్యం.
  • పెద్ద ఎత్తున ప్రచారం: రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు
  • జాతీయ పతాకం విక్రయం: తక్కువ ధరలకు పతాకాలు అందుబాటులో ఉంచాలి – సైజు: 20"x30", ధర: రూ.25
  • ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకం: 13, 14, 15 ఆగస్టు తేదీలలో జెండా ఎగురవేయాలి
  • ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు: జెండా ఎగురవేయాలి, జాతీయ గీతం ఆలపించాలి
  • స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం: యువజన సంఘాలు, ఎన్జీఓల సహకారం
  • ఫోటోలు & వీడియోలు: ప్రతి కార్యకలాపాన్ని డాక్యుమెంట్ చేసి ప్రభుత్వ పోర్టల్‌కి అప్‌లోడ్ చేయాలి
  • అవగాహన కార్యక్రమాలు: బైక్ ర్యాలీలు, పతాకా ర్యాలీలు, పోస్టర్ క్యాంపెయిన్‌లు
  • నిర్వహణ బాధ్యత: గ్రామ/వార్డు కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు, DEOs

📥 ACTIVITIES PDF AND ORDERS: Click Here