హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తన చిన్ననాటి వయసులో అన్నయ్య పుట్టినరోజు జరుపుకున్న అరుదైన ఫోటోలను పంపించి, హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు.

చిరంజీవి స్పందన యథాతథంగా...

“జ‌నసేనాధ్య‌క్షుడికి విజయోస్తు!
త‌మ్ముడు క‌ల్యాణ్ ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి. ప్రతీ మాట‌, ప్రతీ అక్ష‌రం నా హృద‌యాన్ని తాకింది.

అన్న‌య్య‌గా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో.. ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్ష‌త‌, పట్టుద‌ల చూసి ప్రతీ క్షణం గర్వపడుతూనే ఉన్నా.

నిన్ను న‌మ్మిన‌వాళ్ల‌కు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది. ఈ రోజు నీ వెనుక కోట్లాది జనసైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై న‌డిపించు. వాళ్ల ఆశ‌లకు, క‌ల‌ల‌కు కొత్త శక్తినివ్వు.

అభిమానుల‌ ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్న‌య్య‌గా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతి అడుగులోనూ విజ‌యం నిన్ను వరించాల‌ని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను.”

– చిరంజీవి