గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులారా మన ఆర్ధిక మరియు ఆర్ధికేతర హక్కుల కోసం పోరాటాలకు సిద్ధంకండి - GSWS JAC నాయకులు బగ్గా జగదీష్ పిలుపు
🚩గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ ఏకతాటి పైకి వచ్చి ఆర్ధిక మరియు ఆర్ధికేతర అంశాల ఒక ఉమ్మడి ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి - బగ్గా జగదీష్
*ముఖ్యమైన ఆర్ధిక అంశాలు*
1. ఎప్పటి నుండో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న ముఖ్యమైన ఆర్ధిక అంశం ప్రొబేషన్ కాలం 9 నెలలు ఆలస్యం అవ్వడం చేత మనం కోల్పోయిన కాలానికి అరియర్స్ పొందడం.
2. ప్రొబేషన్ కాలంలో ఇంతకు మునుపు టీచర్లకు మంజూరు చేసినట్టే రెండు సంవత్సరాలకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మనకు కూడా మంజూరు చేయాలి అని gsws జేఏసీ పక్షాన మనము ఎంతో కాలంగా వినతులు , విజ్ఞాపనలు చేస్తున్నాము కానీ పై అధికారులు నుండి స్పందన శూన్యం.
3. ఒక ఉద్యోగి సర్వీస్ లో జాయిన్ అయ్యిన నాటి నుండి 6 సంవత్సరాలు పాటు ఒకే కేడర్ లో ప్రోమేషన్ లేకుండా పనిచేస్తున్నట్టు అయితే వారికి ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేయాల్సి ఉంటుంది కానీ అక్టోబర్ 7 వ తేది సమీపిస్తోంది కానీ పై నుండి కనీసం దానికి సంబంధించిన సమాచారం లేదు.
4. దీనికి తోడు 4 DA లు పెండింగ్ లో ఉన్నాయి వాటి విలువ కనీసం 11 శాతం ఉంటుంది.
5. వీటితో పాటు IR ఊసే లేదు, PRC కమిషన్ ఇంతవరకు నియమించలేదు, వీటి గురించి మన పెదన్నలు సీనియర్ సంఘాల నాయకులు బహిరంగంగా పత్రిక ముఖంగా స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు.
ఇప్పటికైనా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులారా మన న్యాయబద్ధమైన ఆర్ధిక అంశాల మీద మనమే పోరాడాలి మన గురించి మనం తప్ప ఇంకెవరు మాట్లాడరు .. ఒకవేళ మన పెద్దన్నలు సీనియర్లు మాట్లాడిన ప్రభుత్వం వారు మన మౌనాన్ని కాదని వారి మాట లెక్కలోనికి తీసుకునే పరిస్థితి ఉండదు.,
కనుక త్వరలోనే GSWS జేఏసీ పక్షాన ఒక ఉమ్మడి ఐక్య కార్యాచరణ మీ ముందు ఉంచి మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం అని పిలుపిచ్చారు.
బగ్గా జగదీష్
అసోసియట్ ఛైర్మెన్
ఏపీ GSWSE జేఏసీ