హైదరాబాద్: వానాకాలం పంటల సాగుకు సాగునీటి సరఫరా విషయంలో రైతులు ఇబ్బంది పడకూడదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో నేడు సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వర్షాల తీవ్రతను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ అవసరమైన నీటి విడుదల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, వానాకాలం పంటలకు సమృద్ధిగా నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రైతులు సాగు కార్యకలాపాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులకు మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు.