అమరావతి : గడిచిన కొంతకాలంగా అధికారిక పత్రాలలో పై పేర్కొన్న కులాల ముందు “గౌడ” అనే పదాన్ని జోడిస్తూ వచ్చారు. అయితే, ఇకపై ఆ ప్రథానం కొనసాగదని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. తాజాగా వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం గమ్మల్ల, కాళీ, గాంధ్ర, శెట్టిబలిజ, శ్రీశయన (సెగిడి) కులాల పేర్ల ముందు “గౌడ” అనే పదాన్ని తొలగిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.