జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ హెచ్చరిక
“మీ పాస్‌వర్డ్ వెంటనే మార్చుకోండి” అని గూగుల్ సూచించింది.
👉 ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల ఖాతాల సమాచారం ప్రమాదంలో పడిందని వెల్లడించింది.
👉 ఈ ప్రమాదానికి సేల్స్‌ఫోర్స్ డేటా బ్రీచ్ కారణమని తెలిపింది.
👉 ఈ ఘటన 2025 జూన్ నెలలో జరిగినదే కానీ తాజాగా మరింత తీవ్రతరమైందని గూగుల్ పేర్కొంది.
👉 హ్యాకర్లు కాల్స్, మెసేజెస్ ద్వారా వినియోగదారులను మోసం చేసి లాగిన్ కోడ్స్, పాస్‌వర్డ్స్ అడుగుతున్నారని హెచ్చరించింది.
⚠️ జాగ్రత్తలు:
1. వెంటనే మీ Gmail పాస్‌వర్డ్ మార్చండి.
2. రెండు-దశల ధృవీకరణ (2FA) ప్రారంభించండి.
3. అనుమానాస్పద లింక్స్ లేదా కాల్స్‌కి స్పందించవద్దు.