గూగుల్ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన Google I/O Connect India 2025 ఈవెంట్‌లో కీలక ప్రకటన చేసింది. తాజా జెమిని 2.5 ఫ్లాష్ (Gemini 2.5 Flash) మోడల్‌ను భారత్‌లోనే ప్రాసెస్ చేసే సాంకేతిక సామర్థ్యాన్ని ప్రారంభించింది. అంటే ఇకపై భారత వినియోగదారుల డేటా విదేశాలకు వెళ్లకుండా, భారత్‌లోనే ప్రాసెస్ చేయబడుతుంది. ఇది ముఖ్యంగా బ్యాంకింగ్, ఆరోగ్య రంగాలు, ప్రభుత్వ సేవల వంటి సున్నితమైన రంగాలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. దేశీయ డేటా సెంటర్లు (ముంబై, ఢిల్లీ) ద్వారా ఈ సేవలు అందించబడి, లేటెన్సీ తగ్గించి, భద్రతా ప్రమాణాలు పెరుగుతాయి.
ఈ ఏడాది తొలిసారిగా గూగుల్ తక్కువ డేటా వినియోగంతో అధిక పనితీరు ఇచ్చే "Gemini Flash" మోడల్‌ను ప్రవేశపెట్టగా, ఇప్పుడు దాన్ని భారత మార్కెట్‌కి అనుగుణంగా తీర్చిదిద్దారు. గూగుల్ ఫైర్బేస్ స్టూడియో, జెమిని మోడల్స్, మరియు Firebase Extensions ఆధారంగా Agentic AI టూల్స్‌ను కూడా డెవలపర్ల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతదేశంలోని ఎనిమిది స్టార్టప్‌లు గూగుల్ జెమిని ఆధారంగా రూపొందించిన ప్రత్యేక టెక్నాలజీలను ప్రదర్శించాయి. వీటిలో వ్యవసాయం, ఆరోగ్య పరిరక్షణ, డిజిటల్ కమర్స్ వంటి రంగాలకు సంబంధించిన ఉపయుక్తమైన అనువర్తనలు ఉన్నాయి.
ఇందులో గూగుల్ ప్రధాన లక్ష్యం — భారతీయ డెవలపర్లకు ఆధునిక ఎఐ టూల్స్ అందుబాటులో ఉంచి, దేశీయ టెక్ ఆవిష్కరణలకు తోడ్పాటు ఇవ్వడమే. ఇది ‘డిజిటల్ ఇండియా’ దిశగా మరొక మైలురాయి అని చెప్పొచ్చు. ఇకపై గూగుల్ జెమిని ఆధారంగా పనిచేసే ఎఐ అప్లికేషన్లు భారత మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందనున్నాయి.