ఆగస్టు 15 నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబడుతోంది. అయితే ఈ అవకాశాన్ని పొందాలంటే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు (ID Card) తప్పనిసరిగా చూపించాలి.

📌 ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండే బస్సులు:
– పల్లెవెలుగు
– ఎక్స్‌ప్రెస్
– మెట్రో ఎక్స్‌ప్రెస్
– సిటీ ఆర్డినరీ

📌 చెల్లుబాటు అయ్యే ID కార్డులు:
– ఆధార్ కార్డు
– ఓటర్ ID
– రేషన్ కార్డు
– డ్రైవింగ్ లైసెన్స్
– ఉద్యోగ ID (సర్కారు సంస్థలైతే)
– విద్యార్థుల ID (గవర్నమెంట్ ఇస్తే మాత్రమే)

ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలోని ఎక్కడినుండైనా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. కానీ గుర్తింపు కార్డు చూపించాల్సిన అవసరం తప్పనిసరి.

👉 ID కార్డు లేకుండా బస్సులో ఎక్కినట్లయితే ఉచిత ప్రయాణం వర్తించదు.