పంజాబ్‌లోని సిర్‌హిండ్‌ జంక్షన్‌ సమీపంలో గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అమృత్‌సర్‌ నుంచి సహర్సా వెళ్తున్న రైలులో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో మూడు కోచ్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఘటన సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బోగీల నుంచి పొగ, మంటలు రావడంతో లోకోపైలట్‌ అప్రమత్తమై వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైలు లుథియానా నుంచి ఢిల్లీకీ వెళ్లాల్సి ఉంది. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.