అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి ప్రత్యేక ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల సద్వినియోగం, పారదర్శకత కోసం అధికారులు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆధారంగా ఫ్యామిలీ కార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

ప్రభుత్వ పథకాలు కుటుంబాలకు చేరువయ్యే విధంగా రీ-డిజైన్ చేసిన స్మార్ట్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ప్రతి కుటుంబం తాము పొందే ప్రయోజనాలు, పథకాల వివరాలు ఒకే కార్డు ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు