ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

పాఠశాల విద్యాశాఖ

పత్రికా ప్రకటన (21.08.2025)

“పారదర్శకంగా డీఎస్సీ నియామకాలు జరుగుతాయి” – ఎం.వి. కృష్ణారెడ్డి, కన్వీనర్ మెగా DSC–2025

https://whatsapp.com/channel/0029VbBL0LE96H4Txkoew114 

మెగా DSC–2025 పరీక్షలు నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, అత్యంత పారదర్శకంగా, సాంకేతిక భద్రతతో విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

▪️ అభ్యర్థులకు టెట్ మార్కులు సరిచేసుకునే తగిన సమయం ఇవ్వబడింది.
▪️ స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా పూర్తయింది.
▪️ ఈ నెల 22వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఎలా తెలుసుకోవాలి?

మెరిట్ లిస్ట్ డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్, జిల్లా విద్యాధికారుల వెబ్‌సైట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’లో ఉన్న అభ్యర్థులకు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందుతుంది.


సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు తీసుకురావాల్సినవి:
✔️ ఒరిజినల్ సర్టిఫికెట్లు
✔️ తాజా కుల ధ్రువీకరణ పత్రం
✔️ గజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల జెరాక్స్ కాపీలు
✔️ 5 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

🔹 చెక్‌లిస్ట్ డీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
🔹 వెరిఫికేషన్‌కు ముందు సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి.

హెచ్చరిక:
👉 ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే దళారులను నమ్మవద్దు.
👉 సోషల్ మీడియాలో అసత్య వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
👉 అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రకటనలు, నోటిఫికేషన్లను మాత్రమే నమ్మాలి.

ప్రభుత్వ సంకల్పం:
రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించడానికి అర్హులైన అభ్యర్థులను మాత్రమే పారదర్శకంగా నియమించడం.


---

ఎం.వి. కృష్ణారెడ్డి
కన్వీనర్, మెగా DSC–2025


---