కైమూర్, బీహార్: మీరు ఎప్పుడైనా ఒక కుక్కకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని ఊహించగలరా? కానీ బీహార్‌లో ఇది నిజంగా జరిగింది. కైమూర్ జిల్లాలోని రామ్‌ఘర్ సర్కిల్‌లో ఉన్న ఇఖలాస్‌పూర్ పంచాయతీ వర్గంలో "డోగ్గి" అనే కుక్కకు రెసిడెన్సీ సర్టిఫికేట్ జారీ చేశారు.

ఆ సర్టిఫికేట్ వివరాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు:

పేరు: డోగ్గి

తండ్రి పేరు: షేరు

చిరునామా: గ్రామ పోస్ట్ – భువనీ, పంచాయతీ – ఇఖలాస్‌పూర్, వార్డు – 13


ఈ పత్రం సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇది ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోందంటూ ప్రజలు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. అధికారులే తప్పు పత్రాలను ఎలా మంజూరు చేస్తున్నారో ఈ సంఘటన ఉదాహరణగా నిలిచింది.
ఇప్పటికే సంబంధిత శాఖ దీనిపై విచారణకు ఆదేశించినట్టు సమాచారం.