వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ (ఆనర్స్) కోర్సుల్లో సీట్ల కేటాయింపు ఈనెల 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం కానుందని యూనివర్సిటీ రిజిస్ట్రారు బి. శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సీటు పొందిన విద్యార్థులు 24, 25 తేదీల్లో కేటాయించిన కళాశాలలకు వెళ్లి చేరాలని సూచించారు. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులతో పాటు ఈనెల 16, 17, 18 తేదీల్లో కొత్తగా దరఖాస్తు చేసిన వారికి కూడా వెబ్ ఆప్షన్ అవకాశం కల్పించినట్లు చెప్పారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఉద్యాన కళాశాలలో అటవీ శాస్త్రం (Forestry) అనే కొత్త కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఇతర వివరాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని రిజిస్ట్రారు పేర్కొన్నారు.