ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణెను భారత మానసిక ఆరోగ్య అంబాసిడర్‌గా నియమించారు.

మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపు, సహాయం పొందే సంస్కృతిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నియామకం జరిగింది. దీపిక గతంలో స్వయంగా డిప్రెషన్‌ సమస్యను ఎదుర్కొని, దానిపై ఓపెన్‌గా మాట్లాడిన ప్రముఖుల్లో ఒకరు. ఆమె స్థాపించిన “ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌” దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవలను అందిస్తోంది.

ఇక అంబాసిడర్‌గా దీపిక, పాఠశాలలు, కళాశాలలు, కార్పొరేట్‌ సంస్థల్లో మానసిక ఆరోగ్య సేవల ప్రాముఖ్యతపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రజల్లో అవగాహన పెంచి, మానసిక ఆరోగ్య సమస్యలను సాధారణ ఆరోగ్య సమస్యల మాదిరిగా తీసుకునే దిశగా ప్రజలను చైతన్యపరచాలని దీపిక లక్ష్యంగా పెట్టుకున్నారు.