తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎంసీహెచ్ఆర్డీ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై అధ్యయనం చేయడానికి నియమించబడిన స్వతంత్ర నిపుణుల కమిటీతో, కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా నిపుణుల కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం చేపట్టిన కుల గణన అత్యంత శాస్త్రీయంగా, ప్రమాణితంగా, నమ్మశక్యంగా ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఈ సర్వే చరిత్రాత్మకం గా ఉండి, దేశానికి రోల్ మోడల్ గా నిలవగలదని పేర్కొన్నారు.

కమిటీ అందించిన సూచనలు, సలహాలను రాష్ట్ర కేబినెట్‌లో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ:

"సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేను నడిపించడం నాకు గర్వంగా ఉంది" అని అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నవారు:

  • ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క
  • మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీమతి సీతక్క, శ్రీ అడ్లూరి లక్ష్మణ్
  • సలహాదారు శ్రీ వేంనరేందర్ రెడ్డి
  • పార్లమెంట్ సభ్యుడు శ్రీ మల్లు రవి
  • నిపుణుల కమిటీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య
  • కమిటీ సభ్యులు
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు
  • ఇతర ఉన్నతాధికారులు