ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోగస్ పెన్షన్ ఎర్రితెలలో భాగంగా పలువురు దివ్యాంగులకు పెన్షన్ నిలిపివేసింది. కానీ తాజాగా ప్రభుత్వం ఒక నోటీసు జారీ చేసింది.

వైకల్యం 40% కంటే ఎక్కువగా ఉన్నవారు, సదరు సర్టిఫికేట్ స్పష్టంగా వైకల్యంగా నమోదు చేసినవారు తప్పనిసరిగా పెన్షన్ పొందుతారని తెలిపింది.

అదే విధంగా, నోటీసులు అందుకున్నవారిలో అర్హత ఉన్నవారి పెన్షన్లు వెంటనే మళ్లీ ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.

దీనితో, వారికీ యథావిధిగా పెన్షన్ కొనసాగనుంది. ఈ మేరకు జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

Follow the Telugu News Adda channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VbBL0LE96H4Txkoew114