రేపు విశాఖకు సీఎం చంద్రబాబు – ‘స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’, జీసీసీ సదస్సులో పాల్గొననున్నారు
సీఎం చంద్రబాబు ఈ నెల 17న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. ఉదయం 11 గంటలకు అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, విశాఖ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం బీచ్ రోడ్డులోని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ‘స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 వరకు నిర్వహించే ప్రత్యేక వైద్య శిబిరాలను సీఎం ప్రారంభించి ప్రసంగిస్తారు.
తరువాత మధ్యాహ్నం 3 గంటలకు రాడిసన్ బ్లూ రిసార్టుకు వెళ్లి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఆధ్వర్యంలో జరిగే సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం సమావేశం ముగిసిన వెంటనే విజయవాడకు బయలుదేరుతారు.