అమరావతి:
మెగా డీఎస్సీలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు శుభవార్త. పాఠశాల విద్యాశాఖ ఈ నెల ఆగస్టు 21 లేదా 22 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ప్రారంభించనుంది.
📌 ఇప్పటికే విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో, అభ్యర్థులు ఆన్లైన్‌లో నమోదు చేసిన టెట్ మార్కులను తిరిగి పరిశీలించి, స్కోర్ కార్డులను విడుదల చేసింది. మార్కుల సవరణకు అభ్యర్థులకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది.
📌 గతంలో ఇచ్చినట్లు కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్టులు ప్రకటించకుండా నేరుగా సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
📌 జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి, అభ్యర్థులను పరిశీలనకు పిలుస్తారు. అనంతరం తుది జాబితాను సిద్ధం చేసి, సెప్టెంబరు మొదటి వారంలో పూర్తిచేయనున్నారు.
📌 సెప్టెంబర్ రెండో వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది.