ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలుగు రాజకీయాల్లో మరో చారిత్రక మైలురాయిని చేరుకున్నారు.
సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే రోజు (1995 సెప్టెంబర్ 1న) ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో #30YearsSinceCBNbecameCM అనే హాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ హాష్‌ట్యాగ్ ఎక్స్(ట్విట్టర్)లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
చంద్రబాబు నాయుడు ఆధునిక ఆంధ్రప్రదేశ్‌కి పునాది వేసిన నాయకుడిగా, అభివృద్ధి దార్శనికుడిగా గుర్తింపు పొందారని టీడీపీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.