🏗️ బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలు మళ్లీ అమలులోకి!

అనుమతులేని భవనాలకు చట్టబద్ధత – నగర, పట్టణ వాసులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిలిచిపోయిన బిల్డింగ్ పరమిషన్ స్కీమ్ (BPS), లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) పథకాలను తిరిగి ప్రారంభించబోతోంది. ఈ పథకాల ద్వారా అనుమతుల్లేని భవనాలు, లేఅవుట్‌లను చట్టబద్ధంగా మంజూరు చేసుకునే అవకాశం ప్రజలకు లభించనుంది.

🔸 పాత గడువు ముగిసిన తర్వాత నిలిపివేసిన పథకాలు మళ్లీ కొనసాగింపు
🔸 అనుమతులు లేని 30,000పైగా ఇళ్లు – 20,000కుపైగా లేఅవుట్లు గుర్తింపు
🔸 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయిలో ఇంటింటి సర్వే నివేదిక ఆధారంగా నిర్ణయం

గత ప్రభుత్వంలో అనుమతుల్లేకుండా ఎన్నో నిర్మాణాలు జరిగాయి. అయితే, ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వీటిని క్రమబద్ధీకరించే దిశగా అడుగులు వేస్తోంది. BPS ద్వారా ఇంటి నిర్మాణాలు, LRS ద్వారా ప్లాట్లు చట్టబద్ధత పొందేందుకు ఇది సువర్ణావకాశం.

📝 గత అనుభవం:
2014–2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఈ పథకాలను తెచ్చినప్పుడు BPS దరఖాస్తుల్లో 90%, LRSలో 65% పరిష్కారం అయినట్టు అధికారులు పేర్కొంటున్నారు.

📊 లేటెస్ట్ అంచనాలు:
▶️ 20,000కు పైగా అనుమతుల్లేని లేఅవుట్లు
▶️ 50,000కుపైగా చట్టబద్ధత లేని ప్లాట్లు
▶️ 30,065 ఇళ్లకు ఆస్తిపన్ను విధించలేదని నివేదికలో తేలింది

🌐 కేబినెట్ ఆమోదం తర్వాత అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి.

ఈ పథకాలు ప్రారంభం కాగానే ప్రజలు తగిన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకొని తమ భవనాలు, ప్లాట్లకు చట్టబద్ధత తీసుకొచ్చుకోవచ్చు. ఇది ఎన్నో సమస్యల నుంచి విముక్తి కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు.