ఆంధ్రప్రదేశ్ మరో భారీ పెట్టుబడిని ఆకర్షించింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) రామాయపట్నం వద్ద దాదాపు రూ. లక్ష కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రోజుకు 1.8 లక్షల నుంచి 2.4 లక్షల బ్యారెల్స్ ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన ఈ రిఫైనరీ కోసం ప్రభుత్వం 6,000 ఎకరాల భూమిని కేటాయించింది. జనవరి 2029 నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
BPCL ప్రస్తుతం ముంబై, కొచ్చి, బిహార్‌లోని మూడు రిఫైనరీలను నిర్వహిస్తోంది. రామాయపట్నం ప్రాజెక్ట్ దేశ రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల డిమాండ్‌ను తీర్చనుంది. ఇందులో 600 MW విద్యుత్ అవసరం ఉండగా, 100 MW స్వీయ ఉత్పత్తి ద్వారా తీర్చుకోనుంది. డిసెంబర్ 2025 నాటికి ఫీజిబిలిటీ రిపోర్ట్ పూర్తవుతుంది.
ప్రాజెక్ట్‌పై పెట్టుబడి పెట్టే సంస్థలకు 20 సంవత్సరాల పాటు 75 శాతం ప్రోత్సాహకాలు అందిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌తో లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని, రాష్ట్ర బాండ్ రేటింగ్స్ మెరుగుపడతాయని అంచనా. గ్రీన్ ఎనర్జీ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రమాణాలతో ఈ రిఫైనరీ దేశంలోనే అత్యాధునికంగా ఉండనుంది.